ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 10-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి వృద్ధి

Apr 10 2026 3:54 AM | Updated on Apr 10 2026 5:16 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.అష్టమి రా.7.33 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.8.25 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.5.03 నుండి 6.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి ప.12.25 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: రా.3.24 నుండి 5.10 వరకు.

సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం..... పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మిథునం..... పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం...... విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

సింహం.... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య.... ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

తుల....... ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృశ్చికం... శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు.. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలయ దర్శనాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మకరం.... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీమాటే చెల్లుతుంది.

కుంభం... ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement