
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.అష్టమి రా.12.36 వరకు, తదుపరి నవమి; నక్షత్రం: పుబ్బ రా.3.44 వరకు, తదుపరి ఉత్తర; వర్జ్యం: ప.10.55 నుండి 12.36 వరకు; దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు; అమృత ఘడియలు: రా.9.07 నుండి 10.50 వరకు
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం.... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యం సహకరించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం... ముఖ్య వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.
కర్కాటకం.... శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు మీదపడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
సింహం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. ప్రముఖుల పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
కన్య... ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
తుల.. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దైవదర్శనాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
వృశ్చికం...ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు..... అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
మకరం...శ్రమ ఫలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవాంతరాలు. మిత్రుల నుండి ఒత్తిడులు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.
కుంభం. నిరుద్యోగులకు శుభవర్తమానాలు.. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి లావాదేవీలు కలసివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.