ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 02-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం

May 2 2026 3:31 AM | Updated on May 2 2026 3:31 AM

Rasi Phalalu: Daily Horoscope On 02-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: బ.పాడ్యమి రా.11.01 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: విశాఖ తె.5.38 వరకు(తెల్లవారితే ఆదివారం), తదుపరి అనూరాధ; వర్జ్యం: ఉ.9.31 నుండి 11.16 వరకు; దుర్ముహూర్తం: ఉ.5.38 నుండి 7.18 వరకు; అమృత ఘడియలు:  రా.8.00 నుండి 9.44 వరకు.

సూర్యోదయం :     5.38
సూర్యాస్తమయం     :  6.15
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. దైవదర్శనాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా పడతాయి. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆశయాలు నెరవేరతాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

మకరం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవచింతన. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: శ్రమ పెరుగుతుంది. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

Advertisement
 
Advertisement
Advertisement