ఈ రాశి వారు శుభవార్తలు వింటారు..వ్యవహారాలలో విజయం! | Horoscope Today: Rasi Phalalu On 16-06-2024 In Telugu | Sakshi
Sakshi News home page

Rasi Phalalu: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు..వ్యవహారాలలో విజయం!

Published Sun, Jun 16 2024 6:51 AM | Last Updated on Mon, Jun 17 2024 10:53 AM

Horoscope Today: Rasi Phalalu On 16-06-2024 In Telugu

మేషం... నిరుద్యోగుల కల నెరవేరుతుంది. భూ, వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత..

వృషభం... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మిథునం... రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కన్య... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం.  ఉద్యోగప్రాప్తి. వాహనయోగం.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులపై భారం తగ్గుతుంది..

తుల... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం... నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు..

ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. నాయకులకు పదవీయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం... పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం... కొన్ని పనులు వాయిదా పడతాయి. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మీనం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement