ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు, లక్ష్యాలు సాధిస్తారు | Daily Horoscope: Rasi Phalalu 01-06-2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: : ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు, లక్ష్యాలు సాధిస్తారు

Jun 1 2024 6:48 AM | Updated on Jun 1 2024 8:10 AM

Daily Horoscope: Rasi Phalalu 01-06-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.నవమి ఉ.6.21 వరకు, తదుపరి దశమి తె.3.50 వరకు(తెల్లవారితే ఆదివారం), నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.2.28 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.1.04 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.35 నుండి 7.12 వరకు, అమృతఘడియలు: రా.10.01 నుండి 11.31 వరకు; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం : 5.28, సూర్యాస్తమయం : 6.27. 

మేషం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం: అనుకున్న పనుల్లో పురోగతి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు  చేస్తారు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.

కన్య: విద్యార్థులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

తుల: అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మకరం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కుంభం: రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement