Today Horoscope: ఈ రాశివారి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు | Daily Horoscope On July 09, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశివారి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు

Jul 9 2024 6:09 AM | Updated on Jul 9 2024 8:26 AM

Daily Horoscope On July 09, 2024 In Telugu

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; ఆషాఢ మాసం; తిథి: శు.తదియ తె.5.20 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి చవితి; నక్షత్రం:  పుష్యమి ఉ.6.12 వరకు, తదుపరి ఆశ్లేష; వర్జ్యం: రా.7.53 నుండి 9.36 వరకు; దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.22 వరకు, తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు; అమృత ఘడియలు: ఉ.6.08 నుండి 8.24 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.34; సూర్యాస్తమయం: 6.35 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

వృషభం: రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

కర్కాటకం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

సింహం: యత్నకార్యసిద్ధి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృశ్చికం: ఆస్తి వివాదాలు పరిష్కారం. కార్యసిద్ధి. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. దైవర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.

మకరం: వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమపడ్డా ఫలితం శూన్యం. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.

కుంభం: వ్యవహారాలు అనుకూలిస్తాయి.ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుబాటు కాగలవు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.
 

Advertisement
 
Advertisement
Advertisement