AP Special: సానుభూతి వద్దు... సమాజంలో గౌరవం కావాలి

Government Support For Physically Disabilities In Andhra Pradesh - Sakshi

సమాజంలో మాకు తగిన గౌరవం కావాలి.. ఉద్యోగసానుభూతి వద్దు.. సమాజంలో ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సహకాలు ఇ‍వ్వాలి.. లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వ పథకాలతో పూట గడుపుకుంటున్న శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అంటున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ పర్సన్‌, ‘మరోక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ అని వీరికి పేర్లు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైన వైకల్యం కలిగి ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లయితే.. అలాంటి వ్యక్తిని అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నిర్ధారిస్తారు​​​​​​​. అంధత్వం ప్రతిభకు  ఏమాత్రం ఆటంకం కాదని ఎందరో దివ్యాంగులు వివిధ రంగాల్లో రాణిస్తూ మరి కొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన సి.ఆర్‌.వి. ప్రభాకర్‌ విద్యారంగంలో సాధించిన తాను సాధించిన విజయానలకు అంగవైకల్యం ఏ మాత్రం ఆటంకం కాదని నిరూపించాడు. ఈయన తండ్రి సి. వెంకటేశ్వర శర్మ, తల్లి విద్యావతి. తండ్రి సి.వెంకటేశ్వర శర్మ.. టీటీడీలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డు అయ్యారు. ఈ దంపతులకు ప్రభాకర్‌ రెండవ సంతానం. ప్రభాకర్‌.. గత 22 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు.

పుట్టుకతో వచ్చిన సమస్యను ఎప్పుడూ లోపంగా పరిగణించలేదు. కేవలం వీల్‌చైర్‌కే ఇతని జీవితం పరిమితమైనప్పటికీ ఎంతో కృషితో ఉన్నత చదువులు చదివారు. ఇటివల సీఏ(చార్టెర్డ్‌ అకౌంటెంట్‌) కోర్సును పూర్తిచేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఆత్మగౌరవంతో మరికొందరికి స్ఫూర్తి అవుతానని అభిప్రాయ పడ్డారు. అదే విధంగా.. వ్యాపార రంగంలో ప్రోత్సాహలు ఇవ్వాలని అన్నారు.

మనదేశంలో అంగవైకల్య సమస్యకు సరైన మందులు, సర్జరీ సౌకర్యాలు లేవని అన్నారు. అమెరికా వంటి దేశంలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అయితే, రూ.15 కోట్ల ఖర్చు చేసిన అది తాత్కలిక వైద్యమే అన్నారు. తాను ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశానని అన్నారు.

ఓ వ్యాపార సంస్థ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది తన జీవిత లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మరిన్నిసబ్సిడీతో కూడిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభాకర్‌ కోరాడు. 

తిరుత్తణి దేవ పెయింటర్‌
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పూట గడుపుతున్నాం.. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తినడానికి తిండి లేక ప్రాథమిక వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నామని తిరుత్తణి దేవ అనే పెయింట్‌ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత 17 సంవత్సరాలుగా పెయింట్‌ చేస్తూ బతుకున్నానని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మఒడి, వికలాంగ పింఛను,వైఎస్సార్‌ ఆసరా, భరోసా వంటి పథకాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌ ఆశయం గొప్పదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చిరు వ్యాపారాలు ప్రారంభించాలని , అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యాయని వాపోయాడు. బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని తెలిపారు. తనలాంటి దివ్యాంగులకు ఎలాంటి సిఫారసు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని పెయింటర్‌ తిరుత్తణి దేవ కోరుతున్నాడు.   

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top