– కలెక్టర్ నిశాంత్‌కుమార్
మదనపల్లె: పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. సోమవారం మదనపల్లె మండలం కోళ్లబయలు పంచాయతీ ఒకటవ సచివాలయం పరిధిలో హౌసింగ్ లేఅవుట్‌లో నిర్వహించిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇళ్లు మంజూరై పూర్తికాని ఇళ్లకు సంబంధించి బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడి రమేష్ రెడ్డి, ఎంపీడీవో తాజ్ మస్రూర్, హౌసింగ్ ఏఈ దీనదయాల్ రాజు, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓగా
రామచంద్రారెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారిగా ఆర్.రామచంద్రారెడ్డిని నియమిస్తూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌శాఖ సోమవారం జీఓఆర్‌టీ నెంబరు 228 జారీ చేసింది. పత్తికొండలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డిని సీఈఓగా పదోన్నతి కల్పించి కడపకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సొంతింటి కల సాకారం
– ఇన్‌ఛార్జి మంత్రి సవిత
కడప సెవెన్‌రోడ్స్ : పట్టణ పేదల సొంతింటి కలనురాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అన్నారు. సోమవారం కడప నగరం లక్ష్మీనగర్ టిడ్కో కాలనీలో నిర్మించిన ఇళ్లను మంత్రి సవిత ప్రారంభించారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని వివరించారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు సొంతింటి కల నిజం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కడప నగర పరిధిలో 2432 జీ+3 గృహాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, జేసీ డాక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
టైలరింగ్‌లో శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మహిళలు, యువతులకు టైలరింగ్‌లో (31 రోజులు), బ్యూటీ పార్లర్‌లో (35) రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని 18–50 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
హుండీ ఆదాయం లెక్కింపు
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి హుండీ ద్వారా రూ. 4.11,573 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. సోమవారం స్థానిక ఆలయంలో నాలుగునెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ్ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం ద్వారా ఆల యానికి 25.450గ్రాముల బంగారు, 305గ్రా ముల వెండి ఆభరణాలు, నగదు రూపంలో రూ.4.11,579 ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. ఆలయఽ చైర్మన్ రాజన్ననాయుడు, ఆలయ పాలకమండలి సభ్యులు, పాల్గొన్నారు.


