స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించే నిర్ణయం విరమించుకోవాలి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగింది. విద్యార్థులతో పాటు మేధావులు దీనిని వ్యతిరేకించి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు అప్పగిస్తే పేదలకు వైద్యం దూరమవుతుంది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష లాగా మారుతుంతి. కోటి సంతకాల సేకరణపై కూటమి నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైఎస్సార్‌పీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. వీటిని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం. –జీవీ ప్రసాద్, విద్యావేత్త, మదనపల్లె


