బాధ్యతల స్వీకరణ
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణంరాజు నాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కడప సీసీఎస్‌లో పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా లక్కిరెడ్డిపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు.ఇక్కడ పనిచేస్తున్న టీవీ కొండారెడ్డి అన్నమయ్య ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్‌కు బదిలీపై వెళ్లారు.
మదనపల్లె రూరల్: మదనపల్లె ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ఈనెల 20న వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ భీమలింగ ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లె ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి సుమారు 200కుపైగా వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఇందులో 100 వాహనాలకు వేలంపాటలు నిర్వహించేందుకు కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అనుమతి ఇచ్చారన్నారు. 20వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ మధుసూధన్ ఆధ్వర్యంలో వేలంపాటలు జరుగుతాయన్నారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు ఆధార్‌కార్డు, డిపాజిట్ మొత్తం చెల్లించి వేలం పాటల్లో పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్/ప్రొద్దుటూరు: దేవాదాయ ధర్మదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా కొత్త భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయని దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఒక గ్రామ పంచాయతీకి ఒక భజన మందిరాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సదరు దేవస్థానం పేరుమీద తహసీల్దార్ ద్వారా జారీ చేయబడిన స్థల ధృవీకరణపత్రం ఉండాలన్నారు. ఐదు సెంట్లకు రూ. 10 లక్షలు, 8 సెంట్లకు రూ. 15 లక్షలు, 10 సెంటలకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేస్తామ న్నారు. ఇతర వివరాలకు కడప డివిజన్ 95818 01858, ప్రొద్దుటూరు డివిజన్ 99856 45430, రాజంపేట డివిజన్ 99669 61554 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రేపు రాజంపేటలో ప్రజా గర్జన
రాజంపేట టౌన్: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాజంపేట పట్టణంలోని పాతబస్టాండులో ప్రజా గర్జనను నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాగర్జనలో రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు,ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలకు చెందిన ప్రజలు పాల్గొంటారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల మార్పులపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రభుత్వం ఈనెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చిందని, అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ప్రారంభం అవుతాయన్నారు. అందువల్ల ఈలోపే ప్రభుత్వం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేలా ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉందని, ఇందుకు ప్రజలు తమవంతు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
పీలేరు: జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్‌టీయూఏ ఇంటర్ యూనివర్సిటీ సెటిల్ బ్యాడ్మింటన్‌లో పీలేరుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హ్యోత్రిశ్రీ ప్రతిభ కనబరిచింది. కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఇంటర్ యూనివర్సిటీ సెటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో 50 కళా శాలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. పీలేరుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తిరుపతి కేఎఎం కళాశాల విద్యార్థిని టి. హ్యోత్రిశ్రీ ప్రతి కనబరచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై ంది. హ్యోత్రిశ్రీ తండ్రి టి. ప్రభాకర్‌రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ కావడంతో ఆయన సలహాలు, సూచనలు తోడ్పాటునందించాయి. హ్యోత్రిశ్రీని కేఎంఎం కళాశాల డైరెక్టర్ అరుణ్‌కుమార్, జేఎన్‌టీయూ అనంతరం స్సోర్ట్ కౌన్సిల్ కార్యదర్శి నారాయణరెడ్డి అభినందించారు.
బాధ్యతల స్వీకరణ


