వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన అల్లాబకష్ కుమారుడు మహమ్మద్ జాఫర్(33) మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్‌లో వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం పనులు ముగించుకుని షాపులో పనిచేసే షాబుద్దీన్ అలియాస్ బాబు (30)తో ద్విచక్రవాహనంలో మదనపల్లె నుంచి కదిరికి బయలుదేరారు. మార్గమధ్యంలో దొమ్మన్నబావి సమీపంలో కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సును వెనుకవైపు నుంచి ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మహమ్మద్ జాఫర్‌కు కుడికాలు విరిగి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహమ్మద్ జాఫర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. మదనపల్లె పట్టణం పూలవీధి వెంకటరమణస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న భార్యాభర్తలు రాజశేఖర్(35), సరస్వతి(32) ద్విచక్రవాహనంలో బయలుదేరి నిమ్మనపల్లె రోడ్డులోని వశిష్ట స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన ఇంటి వద్దకు వెళుతుండగా, రామాచార్లపల్లె వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి, బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : మండలంలోని సాలాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న చెరువు కట్టపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలకు వెలుతున్న వ్యక్తిని వెనుక వైపు ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు...ఎర్రగుంట్లకు చెందిన గోవింద మాల వేసుకున్న జగదీష్(20) అనే వ్యక్తి తిరుమలకు పాదయాత్రగా వెళుతుండగా ఆదివారం రాత్రి 8:30 సమయంలో వెనుక వైపు రాజంపేట బాసింగారిపల్లికు చెందిన కత్తి వెంకటేష్(27) అనే వ్యక్తి వేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ వచ్చి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. జగదీష్‌కి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు. స్వల్పగాయాలు అయిన వెంకటేష్‌కు ఒంటిమిట్ట పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించారు. జగదీష్ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలు


