మిట్స్‌కు ట్రిపుల్ ఏ రేటింగ్
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు ట్రిపుల్ ఏ రేటింగ్ లభించిన ట్లు ప్రిన్సిపాల్ రామనాధన్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్‌పీటీఈఎల్ పరీక్షల్లో అత్యధికులు ప్రతిభ చూపడంతో ఈ రేటింగ్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు టాప్ ట్వంటీలో మిట్స్ కళాశాలకు జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకుగా గుర్తింపు లభించినట్లు వివరించారు.
సంబేపలె ్ల: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే అవాంఛనీయ సంఘటనలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలో జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.
ఒంటిమిట్ట : విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పోరుబాట పట్టనున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెన్నపేరూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా కౌన్సిల్ సమావేశాల కరపత్రాలను ఉపాధ్యాయులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న మైదుకూరులో జిల్లా కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు షీలా కుమారి, ఉపాధ్యాయులు పెద్ద రెడ్డయ్య, శ్రీధర్, హెలెన్ మంజుల, అనురాధ, సుజన, శివరామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు
పెనగలూరు: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఐపీఓ జీవీ ప్రసాద్ అన్నారు. మంగళవారం పెనగలూరు సబ్ పోస్టాఫీసును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 20 వరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పెనగలూరు పోస్టుమాస్టర్ సుబ్బరాయుడు, ఎల్ సుబ్రమణ్యం, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మిట్స్‌కు ట్రిపుల్ ఏ రేటింగ్


