రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
కలికిరి : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడిన ఘటన ఆదివారం రాత్రి కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని మర్రికుంటపల్లి గ్రామం కొత్తదళితవాడకు చెందిన గంగయ్య స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో కలికిరికి వెళుతున్నాడు. కలికిరి వైపు నుంచి గడికి చెందిన షఫిక్, నాసిక్ ఇద్దరు ద్విచక్రవాహనంలో ఎదురుగా వచ్చి మర్రికుంటపల్లిరోడ్ పంచాయతీ కార్యాలయంలో సమీపంలో ఢీకొన్నారు. రోడ్డు పక్కనున్న ఝరికోన పైప్‌లైన్ లీకేజీతో నీరు రోడ్డుపై చేరింది. ఆ ప్రాంతంలో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ప్రమా దం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు కలికి రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏడాదికి పైగా రోడ్డుపై ఝరికోన లీకేజీ నీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయ ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంటిమిట్ట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలులోని నిర్మల్ నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారుకు తుమ్మచెట్లు అడ్డుపడటంతో చెరువులో మునగలేదు. ప్రమాదం తప్పింది.


