తంబళ్లపల్లె ఎంపీపీగా చిటికి శ్యామలమ్మ
తంబళ్లపల్లె: తంబళ్లపల్లె ఎంపీపీగా కోసువారిపల్లె ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డీఎల్‌డీఓ అమరనాథరెడ్డి, ఏపీడీఓలు బాపూజీ పట్నాయక్‌లు ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. అంతకు మునుపు ఎంపీపీగా ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ విదేశాలకు వెళ్లాలనే కారణంగా ఇటీవల రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు మండలంలో 11 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 10 మంది సభ్యులు హాజరయ్యారు. కుక్కరాజుపల్లె ఎంపీటీసీ సభ్యురా లు అనసూయమ్మ గైర్జాజయ్యారు. ఎంపీపీ అభ్యర్థిగా కోసువారిపల్లె ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ పేరును ఎద్దులవారిపల్లె ఎంపీటీసీ సభ్యురాలు హరిత ప్రతిపాదించారు. కన్నెమడుగు ఎంపీటీసీ రెడ్డి మహేష్ బలపరిచి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఒకే నామినేషన్ రావడం, అందరి మద్దతు ఆమోదంతో చిటికి శ్యామలమ్మలను ఎంపీపీగా ప్రకటించి ధ్రువీకరణపత్రం అందజేశారు. అనంతరం శ్యామలమ్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీటీసీ సభ్యులందరూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కావడంతో.. చైర్మన్ పీఠం ఆ పార్టీ వారికే దక్కింది.


