విద్యార్థి అదృశ్యం
తంబళ్లపల్లె : ఓ విద్యార్థి అదృశ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని దిగువపాళ్యం పంచాయతీ చింతలరేవుపల్లెకు చెందిన వి.దామోదర కుమారుడు వి.రాజు(15) ములకలచెరువు మండలం వేపూరికోట ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. శనివారం పాఠశాలకు రాలేదని అక్కడి ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బందువులు, స్నేహితులను విచారణ చేసిన కుటుంబ సభ్యులు చేసేదిలేక తంబళ్లపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


