●రూ.లక్షలకు ఒప్పందం
ఎఫ్‌ఐఆర్‌లో నిందితులు వీరే..
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్‌లో పూర్తిస్థాయిలో వాస్తవాల గుట్టు రట్టయ్యేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కొక్కటిగా వివరాలు వెలుగులోకి వస్తుండగా ఇప్పటిదాకా ఎంత మంది కిడ్నీలు తీసి ఎందరికి అమర్చారు, ఇందులో ఏ స్థాయిలో నగదు చేతులు మారింది, ఎవరికి ఎంత వాటాలు చేరాయి, అంతటికీ వైద్యులు, దళారులే సూత్ర, పాత్రధారులా, తెరవెనుక ఇంకా ఎవరెవరున్నారు అన్న ఉత్కంఠ నెలకొనగా, ఈ వాస్తవాల వెల్లడి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దర్యాప్తుపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు మొదలైనట్టు దీన్నిబట్టి తెలుస్తోంది.పట్టణమైన మదనపల్లెలో సాధారణ చికిత్సలు, వైద్యం మాత్రమే అందుబాటులో ఉంది. అవయవ మార్పిడికి సంబంధించి అనుమతిలేదు. ఆ స్థాయిలో సౌకర్యాలు, వైద్య నిపుణులు లేనప్పటికీ స్థానిక గ్లోబల్ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది.
ఆ డాక్టర్ పార్థసారధి
గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యుడు రాయలసీమకు చెందిన పార్థసారధిగా గుర్తించిన పోలీసులు ఇతను బెంగళూరులో వైద్యవృత్తిలో స్థిరపడినట్టుగా చెబుతున్నారు. గ్లోబల్ హాస్పిటల్‌లో అనుమతిలేని మానవ అవయవాల మార్పిడిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్టుగా గుర్తించారు. రెండో నిందితుడు అయిన ఇతని పేరు తెలియకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌లో బెంగళూరుకు చెందిన వైద్యుడిగా నమోదు చేశారు. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే రూ.లక్షల్లో ఫీజు చెల్లించేవారని పోలీసు వర్గాల సమాచారం. డాక్టర్ కోసం బృందాలు గాలిస్తున్నాయి.
ఆ మత్తు డాక్టర్ ఎవరు
మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమతి లేకపోయినా యమున కిడ్నీ తొలగించి వేరోకరికి అమర్చగా ఆపరేషన్ సమయంలో ఆమెకు మత్తు ఇచ్చిన డాక్టర్ ఎవరో తేలాల్సి ఉంది. ఆ డాక్టర్ తేలితే ఇలా ఎన్ని ఆపరేషన్లకు మత్తు ఇచ్చారో తెలుస్తుంది. ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది వివరాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి తేవాల్సిఉంది.
ఏ–1: డాక్టర్ ఆంజనేయులు (డీసీహెచ్‌ఎస్)
ఏ–2: బెంగళూరుకు చెందిన యూరాలజిస్ట్
ఏ–3: బాలు టెక్నిషిషన్–మదనపల్లె
ఏ–4: మెహరాజ్ టెక్నిషియన్–కదిరి
ఏ–5: పిల్లి పద్మ మధ్యవర్తి, వైజాగ్
ఏ–6: సత్య మధ్యవర్తి, వైజాగ్
ఏ–7: సూరిబాబు
కిడ్నీ రాకెట్‌లో... హాస్పిటల్ హార్డ్‌డిస్కుల్లో ఫుటేజీ మాయం
కిడ్ని అమర్చిన వైద్యుడు పార్థసారధిగా గుర్తింపు
మృతురాలు యమున కిడ్నీకిరూ.లక్షల్లో ఒప్పందం
ప్రస్తుతానికి కేసులో ఏడుగురు,సంఖ్య పెరిగే అవకాశం
జిల్లా ఎస్పీ పర్యవేక్షణలోకి వెళ్లిన దర్యాప్తు
●రూ.లక్షలకు ఒప్పందం
●రూ.లక్షలకు ఒప్పందం
●రూ.లక్షలకు ఒప్పందం


