ముగిసిన బడేమకాన్ దర్గా ఉరుసు ఉత్సవాలు
మదనపల్లె సిటీ: స్థానిక బెంగళూరు బస్టాండు వద్దనున్న బడేమకాన్‌లోని హజరత్ ఖాదర్‌షా ఔలియా దర్గాలో జరిగిన ఉరుసు ఉత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా శుక్రవారం దర్గాలో ఫకీర్ సిద్దీఖుల్లాషా బృందం ఆధ్వర్యంలో తహలీల్ ఫాతేహా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. హిందూ ముస్లిం సోదరులు దర్గాలోని మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన ఫహిం అతిష్, మహారాష్ట్రకు చెందిన సుల్తాన్ నాజాల మద్య హోరాహోరీగా ఖవ్వాలి పోటీ జరిగింది. కార్యక్రమంలో దర్గా ముతవల్లీ మకాన్‌దార్ సయ్యద్‌హాషిం, సయ్యద్ పర్వేజ్‌హుసేని సహరవర్ధి, ఖమర్‌అమీని, రూటా మహమ్మద్‌ఖాన్, అహ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
పీలేరురూరల్: కడప రీజనల్ పరిధిలో 55 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 35 నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు కడప డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారిణి పి. లావణ్య అన్నారు. శుక్రవారం పీలేరు పట్టణం సీఎల్‌ఆర్‌సీ కార్యాలయం ప్రాంగణంలో సర్వే నంబర్ 142/3, 143/3లో 46 సెంట్లు భూమిని రైతు బజారుకోసం పరిశీలించారు. అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు మదనపల్లె, రాయచోటిలో మాత్రమే రైతుల బజార్లు ఉన్నాయన్నారు. కడప రీజనల్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గంలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప రీజనల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రూ. 145 కోట్లు వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ. 69 కోట్లు వసూలు చేసినట్లు మిగలింది మార్చి ఆఖరులోపు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీ త్యాగరాజు, ఏఎంసీ ఛైర్మన్ పి. రామ్మూర్తి, కార్యదర్శి హరినాథ, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన బడేమకాన్ దర్గా ఉరుసు ఉత్సవాలు


