ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నం
మదనపల్లె రూరల్ : పట్టణ నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలమైన వంక పొరంబోకును ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై అడ్డుకున్నారు. శుక్రవారం పట్టణంలోని బీకే.పల్లె రెవెన్యూ రెడ్డీస్ కాలనీ బృందావన్ అపార్ట్‌మెంట్ వెనుకవైపు వంకపొరంబోకు స్థలం సర్వే నంబర్ 513లో 24 ఏళ్ల క్రితం తమకు పట్టాలు ఇచ్చారని చెబుతూ, కొందరు వ్యక్తులు స్థలం తమ అనుభవంలో ఉందని చూపేందుకు గుడారాలు వేశారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్వో, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లారు. గుడారాలు వేసుకున్న స్థలం వంక పొరంబోకు అని, ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందితో గుడారాలను తొలగించారు.
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు


