ప్రభుత్వం ఆదుకోవాలి
వేరుశనగ సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలబీమా,ఇన్‌ఫుట్‌సబ్సీడీ సకాలంలో ఇవ్వాలి. ఇ–క్రాప్ నమోదు చేసుకోని రైతులకు కూడా పంటనష్టపరిహాం ఇవ్వాలి.
–రమేష్‌బాబు, జిల్లా కౌలురైతుల
సంఘం కార్యదర్శి, తరిగొండ
భారీగా నష్టపోయాం
ఈ ఏడాది గ్రామంలో మోతుబరి రైతు దగ్గర రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నా. రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. పంట సాగుకు రూ. 42 వేలు ఖర్చు వచ్చింది. ప్రస్తుతం వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. రెండు ఎకరాలకు కలిపి ఐదు బస్తాలు దిగుబడి వచ్చింది. మార్కెట్లో వాటిని విక్రయిస్తే రూ.11 వేలు కుడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు రూ. 7 వేలు చెల్లించాలి. ఈలెక్కన పంట సాగు ఖర్చు కుడా రాకపోవడంతో భారీగా నష్టపోయాను. – గెంటెం దేవేంద్ర,
టి.రాచపల్లె, గుర్రంకొండ మండలం
నష్టపరిహారం చెల్లించాలి
నాకు ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరా పొలం రైతు దగ్గర కౌలుకు తీసుకొన్నాను.ఈ ఏడాది రెండు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. సాగుకు రూ. 40వేలకు పైగా ఖర్చు అయింది. నెలరోజులపాటు కురిసిన ముసురు వర్షాలకు పంట దదెబ్బతింది. దీంతో ఎకరాకు రెండున్న బస్తాలే దిగుబడి వచ్చాయి. పొలం కౌలు ఒక బస్తా కాయలు ఇవ్వాల్సి ఉంది. పంట దిగుబడిలో కౌలు పోను నాలుగు బస్తాలు మిగులుతాయి. మార్కెట్లో వాటిని విక్రయిస్తే రూ.9 వేలు వస్తుంది. రూ. 30 వేలకు పైగా నష్టపోయాను. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలి. – చాకల పరమేశ,
కురవపల్లె, గుర్రంకొండ మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఆదుకోవాలి


