17 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 17 నుంచి అండర్–19 బేస్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కడప ఆర్గనైజింగ్‌సెక్రటరీ చంద్రమోహన్ రాజు తెలిపారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు డిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు.
రాయచోటి టౌన్: యూపీఎస్సీ సివిల్స్‌కు సన్నద్ధమయ్యే ఎస్సీ,ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమ, సాధికారిక అధికారి దామోదర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 340 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. డిసెంబర్ 10 నుంచి 2026 ఏప్రిల్ 10వ తేదీ వరకు శిక్షణకొనసాగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతిలోని డాక్టర్ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అసక్తి కలిగిన యువతీ యువకులు ఈ నెల 16వ తేదీ నుంచి www.apstudy circle. apcfss.in అనే వెబ్‌సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం కావడంతో అమ్మవారికి అభిషేకాలు, కుంకమార్చన చేసి భక్తులు తీసుకొచ్చిన రంగురంగుల గాజులతో పాటు బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, నిమ్మకాయల హారాలతో అందంగా అలంకరించారు. అలాగే భక్తులు అమ్మవారికి నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్య స్వామి రాహుకాల విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. ఈ పూజలు ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
గాలివీడు: ప్రభుత్వం నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో భాగంగా 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన జిల్లా జట్టు క్రికెట్ ఎంపికల్లో మండలంలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులు దేరంగుల రామేశ్వర్, మడితం రమణయ్య, పి.సురేష్ కుమార్‌లు ఎంపికై నట్లు మండల విద్యాశాఖ అధికారులు పి.నాగరాజు, వి.శ్రీనివాసులు తెలిపారు. వీరు ఈనెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న స్టేట్ లెవెల్ ఎంపిక పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికిఎంపికై న ఉపాధ్యాయులను ఎంఈఓలు అభినందించారు.
రాయచోటి: నాణ్యమైన విద్య ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రమణ్యం పేర్కొన్నారు. రాయచోటి డైట్ కళాశాల ఆవరణంలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి అధ్యాపక బృందంతో కలిసి డీఈఓ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన ఛాత్రోపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
17 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు


