
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
రాయచోటి టౌన్ : రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వైద్యులకు సూచించారు. బుధవారం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూపరిటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ ఆధ్వర్యంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తీర్చి దిద్దుతామని చెప్పారు. అంతకు ముందు మంత్రిని ఆస్పత్రి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ కమిటీ సభ్యులు ఖాదర్ బాష, మహమ్మద్, నిరంజన్ నాయుడు, లక్ష్మిదేవి, ఏపీఐఐసీ డైరెక్టర్ కొండా భాస్కర్‌రెడ్డి, నాయకులు బోనమల ఖాదర్ వలి, ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.