
ఇద్దరు జూదరుల అరెస్ట్
మదనపల్లె రూరల్ : పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. బుధవారం నీరుగట్టువారిపల్లె సమీపంలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరోవ్యక్తి పారిపోయాడన్నారు. నిందితుల నుంచి రూ.6వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పట్టుగూళ్ల మార్కెట్‌పై తుపాన్ ప్రభావం
మదనపల్లె సిటీ : తుపాన్ ప్రభావం పట్టుగూళ్ల మార్కెట్ పడింది. దీంతో మార్కెట్ గూళ్లు రాక వెలవెలబోతోంది. నిత్యం మార్కెట్‌లో రైతులు, రీలర్లతో సందడిగా ఉంటుంది. గత వారం నుంచి మార్కెట్ గూళ్లు రాలేదు. వర్షానికి తేమ శాతం ఎక్కువ ఉండటంతో పాటు గూళ్లు సరిగా రావు. దీంతో రైతులు మార్కెట్‌కు గూళ్లు తీసుకురావడం లేదు. ఈనెల 15వతేదీ నుంచి ఇప్పటి వరకు పూర్తిగా గూళ్లు రాలేదు.దీంతో మార్కెట్ బోసిపోయింది.
రైలు కింద పడి సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన గురుకిరణ్ (31) అనే సచివాలయ ఉద్యోగి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరు గ్రామానికి చెంగిన గురుబ్రహ్మ కుమారుడు గురు కిరణ్ ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి గ్రామంలోని సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఒక బాబు సంతానం. అయితే కుటుంబ సభ్యులు తనను ఒంటరి వాడిని చేశారని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇద్దరు జూదరుల అరెస్ట్