
డ్యూటీ రోస్టర్ మార్చండి
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సిబ్బందికి డ్యూటీ రోస్టర్ మార్చాలని సూపరింటెండెంట్ రమేష్‌కు బుధవారం విన్నవించారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి ముబారక్..సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చి చర్చించారు. ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్, ఓపీ, ఇంటర్నెట్ విభాగాల్లో పనిచేస్తున్న తమకు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు కేటాయించకపోవడంతో పని నేర్చుకునే అవకాశం లేకుండా పోతోందని వాపోయారు. ఏడాదికాలంగా బయట విధులు మాత్రమే నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జీజీహెచ్‌గా ఉన్న ఆస్పత్రి త్వరలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ కాబోతుందన్నారు. ఆ పరిస్థితిలో తమకు ఇక్కడ విధులు కేటాయిస్తారో లేదోనని, ఒకవేళ ఇతర ఆస్పత్రులకు తమను బదిలీ చేస్తే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అవగాహన లేకపోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందరికీ సమానంగా రొటేషన్ పద్దతిలో విధులు కేటాయించాలని కోరారు.
గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా
పదోన్నతి కల్పించాలి
కడప రూరల్ : హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతులు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్ నాయకులు ప్రిస్కిల్లా, మనో థెరిస్కోవా తెలిపారు. ఆ మేరకు బుధవారం స్థానిక వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు చాలా మంది పదవీ విరమణ పొందే దశలో ఉన్నారని తెలిపారు. కనుక హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధమ్మ, అమరావతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో మూడు పందులు మృతి
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్‌తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామ సచివాలయాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ తీగలు కిందకు జారిపోయి కేంద్రం ఇనుప గేటుకు తగులుకున్నాయి. దీంతో గేటుకు విద్యుత్ ప్రసరించింది. బుధవారం ఉదయం కేంద్రం వద్ద సంచరిస్తున్న మూడు పందులు గేటుకు తగిలి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక వైపు వర్షం కురుస్తుండడంతో పాటు ఆ సమయానికి మనుషులు అటువైపు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్‌లైంది. పందులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.
సూపరింటెండెంట్‌కు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వినతి

డ్యూటీ రోస్టర్ మార్చండి

డ్యూటీ రోస్టర్ మార్చండి