
ఎట్టకేలకు వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట
● అన్నమయ్య థీంపార్కులో శ్రీవారి ప్రసన్నం
● ఈనెల 31 నుంచి 3 వరకు విగ్రహప్రతిష్ట మహోత్సవాలు
రాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 108 అడుగుల విగ్రహం (అన్నమయ్య థీంపార్కు)లో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఎట్టకేలకు శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ట కానున్నది. టీటీడీ సన్నాహాలు చేపట్టింది. ఈమేరకు బుధవారం టీడీపీ పీఆర్వో రవి విగ్రహప్రతిష్టమహోత్సవాల వివరాలను తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబరు 3 తేదీ వరకు వెంకటేశ్వరస్వామి విగ్రహప్రతిష్ట మహోత్సవాలలో కుంభాభిషేకం సంప్రోక్షణం చేస్తారు. 31 సాయంత్రం యజమాన సంకల్పం, వివ్వక్సేన ఆరాధనంము, యాగ సంకల్పం, రక్షా బంధనంము, వాస్తు హోమం, పంచగవ్వప్రోక్షణం, మృత్యంగ్రహణం, అంకుర్పారణం చేపట్టనున్నారు. నవంబర్ 1న ఉదయం భగవతుపణ్యాహం, మానోనాత్మన శాంతిహోమం, మహాకుంభరాధానం, ద్వాదశాక్షర, అష్టాక్షర, షడక్షర, విష్ణుగాయత్రీ పంచసూక్తపూర్వకమూర్తి హోమం, వేద, ప్రబంధాది పారాయణములు, పూర్ణాసుతి, శాత్తుమర, తీర్థగోష్టి చేపడతారు. సాయంత్రం మూర్తిహోమం, వేద, ప్రబంధం, విష్ణుసహస్రనామ పారాయణములు, జలాధివాసనము, పూర్ణాహుతి, బలిశాత్తుమొర నిర్వహించనున్నారు. 2న ఉదయం భగవత్పుణ్యాహం, విమానగోపుర, ధ్వజప్రసాదాములకు ఛాయాధివాసం, కర్మాంగస్నపనుము, నేత్రోనిమ్మలనం, మూర్తి హోమం, వేదాది పారాయణములు, పూర్ణహుతి, మహిర్నివేద, శాత్తుమొర, సాయంత్రం చతుఃస్ధానార్చన, శయ్యాదివాసం, జీవాధితత్వన్యాసహోమం, పంచసూక్త హోమం, పూర్ణాహుతి, గోష్ఠి చేపట్టనున్నారు. 3న ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 9గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభప్రక్షణ, ప్రాణప్రతిష్ట అనంతరం ధ్వజారోహణ, మహార్నివేదన, మహామంగళహారతి తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదేరోజు సాయంత్రం 6గంటలకు శ్రీనివాస కళ్యాణోత్సవం, ప్రాకారోత్సవం, ధ్వజావరోహణంతో ప్రతిష్ట కుంబాభిషేక సంప్రోక్షణం ముగియనున్నదని టీటీడీ పీఆర్వో తెలియజేశారు.