
ఎకై ్సజ్ సురక్ష యాప్‌పై అవగాహన అవసరం
రాజంపేట : ఎకై ్సజ్ సురక్ష యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్ తెలిపారు. రాజంపేటలో పలు మద్యంషాపులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 మద్యంషాపులు, 11 బార్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. ప్రతి షాపులో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం మాత్రమే ఉందన్నారు. నకిలీ మద్యం ఎక్కడా లేదన్నారు. నకిలీ మద్యం అమ్మితే ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా ఇట్టే పసిగట్టవచ్చునన్నారు. ఒక వేళ ఎక్కడైనా మద్యం అమ్మిన బాటిల్ కన్సూమర్ పోర్టల్‌లో వివరాలు రాకపోయినా, మద్యం బాటిల్ అనుమానాస్పదంగా ఉన్న వెంటనే స్థానిక ఎకై ్సజ్ అధికారులు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (7981216391)ను సంప్రందించాలన్నారు. వాట్సాప్‌లో ఆ బాటిల్ ఫొటో పంపిన తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 1,11,628 మద్యం సీసాలను స్కాన్ చేసి అమ్మడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లిక, ఎస్‌ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్, స్కూటర్ ఢీకొని ముగ్గురికి గాయాలు
పీలేరు రూరల్ : ట్రాక్టర్ – స్కూటర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మొరవ వడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ పెళ్లికణం గూడెంకు చెందిన పి.జ్యోతి భానుకుమార్ (23), పి.హరీష్ (21), ఎన్.జ్యోతికుమార్ (19) టపాసులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంలో పీలేరుకు బయలుదేరారు. మొరవవడ్డిపల్లె వద్ద స్కూటర్, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పీలేరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
యువకుడికి గాయాలు
గాలివీడు : మండలంలోని నక్కలవాండ్లపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసీఫ్(33) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని నూలివీడు గ్రామం నక్కలవాండ్లపల్లి చెరువు మలుపు వద్ద ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో పార్సిల్ కొరియర్ బాయ్ ఆసీఫ్ ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికుల సమాచారం మేరకు ప్రైవేటు వాహనంలో రాయచోటికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కడప తరలించారని బంధువులు తెలిపారు.