
ప్రజల మన్ననలు పొందిన నాయకుడు బ్రహ్మయ్య
బ్రహ్మయ్య విగ్రహం, ఉద్దండం ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి, చొప్పా గంగిరెడ్డి
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో సర్పంచిగా పని చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందిన ఉద్దండం బ్రహ్మయ్య సేవలను రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కొనియాడారు. ఆదివారం తాళ్లపాకలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో తాళ్లపాకలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచి ఉద్దండం బ్రహ్మయ్య విగ్రహాష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి.. బ్రహ్మయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచిగా తాళ్లపాక గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అన్నమాచార్య యూనవర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పని చేసిన వ్యక్తి ఉద్దండం బ్రహ్మయ్య అన్నారు. తాళ్లపాకను అభివృద్ధి చేయాలని అనేక మార్లు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈయనతోపాటు సోదరుడు చొప్పా అనిల్‌రెడ్డి తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహావిష్కరణ సభలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, జనసేన నేత అతికారికృష్ణ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టరు అద్దెపల్లె ప్రతాప్‌రాజు, టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు, మోదుగల కళావతమ్మ, ఇంజినీరింగ్ కళాశాల అధినేత పెంచలయ్య, న్యాయవాది సురేష్‌రాజు, అదృష్ణదీపుడు, మోహనరావు, గణేషు, గీతాంజలి విద్యా సంస్థల అధినేత ఎస్వీరమణ, మైనార్టీ నేత గుల్జార్‌బాషా, రాజంపేట టీడీపీ అధ్యక్షుడు మేడికొండు రవికుమార్‌నాయుడు, మాజీ ఎంపీపీ పారా సుబ్బానాయుడు, ప్రముఖ వైద్యుడు సుధాకర్, టీడీపీ నాయకుడు ఇడమడకల కుమార్, తాళ్లపాక గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజల మన్ననలు పొందిన నాయకుడు బ్రహ్మయ్య