
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
– మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి(వాల్మీకిపురం)/కలకడ : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికే చంద్రబాబు కుట్ర పన్నారని, అందుకే వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం మండలం నగిరిమడుగు, కలకడ మండలంలోని కలకడ పంచాయతీ, కోన గ్రామ పంచాయతీలలో ఆదివారం కోటి సంతకాల సేకరణపై రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు, అందరికీ అందుబాటులోకి వైద్య విద్యను తీసుకురావడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేసి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. వీటిలో దాదా పు పది కళాశాలలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటికి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పంగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టారన్నారు.
డైవర్షన్ రాజకీయాలు
కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేక సెగలు తగులుతుండటంతో సీఎం చంద్రబాబు రోజుకొక రకం డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. జరగని లిక్కర్ స్కామ్‌లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భందించారని గుర్తు చేశారు. ఎంపీ బెయిల్‌పై విడుదలైనా కూడా ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులపై కూటమి ప్రభుత్వం ఏదో రకంగా వేధింపులు కొనసాగిస్తుండటం దుర్మార్గపు చర్యలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలు, కుట్రలు, దౌర్జన్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలతో సంతకాలు సేకరించారు. వాల్మీకిపురం కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నీళ్ళ భాస్కర్, సీనియర్ నాయకులు చింతల ఆనందరెడ్డి, మండల కన్వీనర్ పులి శివకుమార్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, సర్పంచ్ రజని, ఎంపీటీసీ రెడ్డెప్ప, పీఎస్ వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, రమేష్, విశ్వనాథ, ఈశ్వర్‌రెడ్డి, కలకడ మండలంలో కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, కోన సర్పంచ్ జల్లా రాజగోపాల్‌రెడ్డి, షావత్ అల్లీ ఖాన్, శ్రీనివాసులురెడ్డి, లక్ష్మిరెడ్డి, రవికుమార్, జిలానీ బాషా, మస్తాన్ అహ్మద్, అంజన్‌కుమార్, జీవి కిశోర్, వెంకట్రమణారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.