
కూటమి కుట్రలను ప్రజలకు వివరిద్దాం
గాలివీడు : కూటమి ప్రభుత్వం కుట్రలను ప్రజలకు వివరిద్దామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బోరెడ్డిపల్లె, నూలివీడు పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఇంటా తెలియజేసి.. వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేస్తామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం నక్కలవాండ్లపల్లెలో మల్లేశ్వరస్వామి దేవస్థానానికి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కృషితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించి ముఖ ద్వారానికి టెంకాయ కొట్టారు. బోరెడ్డిగారిపల్లెలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ కార్యకర్త ఖలందర్‌బాషా ఇంటిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కుట్రలను కోటి సంతకాల కార్యక్రమం ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంగా అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యలు గడ్డం చంద్రప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ వెంకట నారాయణరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు మన్సూర్, నాయకులు మహబూబ్‌బాషా, భానుమూర్తిరెడ్డి, అర్చకులు జల్లా మల్‌రెడ్డి, వల్లపు నాగేష్, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్
వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్‌రెడ్డి