
ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరిన అక్కాచెల్లెలు
మదనపల్లె సిటీ : డీఎస్సీలో ఎంపికై న అక్కాచెల్లెలు ఒకే పాఠశాలలో చేరిన అరుదైన సంఘటన ఇది. ములకలచెరువు మండలం బత్తాలాపురానికి చెందిన చంద్రమోహన్, సత్యవతి కుమార్తెలు జల్లా శ్రీలత, జల్లా హేమలతలు మెగా డీఎస్సీ రాశారు. ప్రతిభ కనబరిచి ఇద్దరు ఎంపికయ్యారు. కౌన్సెలింగ్‌లో మదనపల్లె హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. సోమవారం వీరిద్దరు పాఠశాలలో ఎస్‌ఏలుగా విధుల్లో చేరారు. వీరికి పాఠశాల హెచ్‌ఎం,ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు ఎగివింటి సుధాకర్, బెల్లం సుధాకర్, జయరాం, బార్గవి,శోభారాణి తదితరులు స్వాగతం పలికారు.
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడంలో అధికారులు ఏ మాత్రం అలస త్వం వహించకుండా చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. అదనపు ఎస్పీ వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. వారి నుంచి అర్జీలను స్వీకరించారు.సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూరీసర్వేపై
అవగాహన కల్పించాలి
సిద్దవటం : భూ రీసర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.సోమవారం సిద్దవటం మండలంలోని కనుములోపల్లిలోని సర్వే నంబర్ 29, 30, 31లోని 12.05 ఎకరాల భూమిలో సర్వేయర్లు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సంబంధిత రైతులు ప్రసాద్‌రెడ్డి, గౌస్‌బాషాలతో మాట్లాడారు. సర్వే సిబ్బంది రైతులకు నోటీసులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ల్యాండ్ అధికారి ఎ.మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీలత, పోరభాకర్, మండల సర్వేయర్ సోమశేఖర్, సచివాలయ సర్వేయర్లు హరినాథ్, గురుసాయి, రవితేజ, కారుణ్య తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి భక్తి శ్రద్దలతో పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామి, అమ్మవారి మూల వి రాట్‌లకు ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి, శేఖర్ స్వాములు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగు రంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఈవో డివి రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
రాయచోటి : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓలకు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏడీ సర్వే భరత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరిన అక్కాచెల్లెలు

ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరిన అక్కాచెల్లెలు