
నీటికోసం రోడ్డెక్కిన మహిళలు
బి.కొత్తకోట : స్థానిక బాబాటాకీస్ ప్రాంతానికి చెందిన మహిళలు 40 రోజులుగా తమకు తాగునీటి సరఫరా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం బీరంగిరోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ నీళ్ల కోసం పడుతున్న ఇబ్బందులపై ఏకరువు పెట్టారు. రో డ్డుకు అడ్డంగా తాడుకట్టి రాకపోకలను అడ్డుకున్నారు. సమస్యను పరిష్కారించాలనీ, నీటిని సరఫరా చేయాల ని అధికారులను విన్నవించినా చర్యలు తీసుకోలేదని మహిళలు పేర్కొన్నారు. నీళ్ల కోసం పడుతున్న ఇబ్బందులను పట్టించుకొని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. రెండురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ ప్రమీల హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.