
విధి నిర్వహణకు శారీరక దారుఢ్యం ముఖ్యం
● ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి కృషి
● ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు మంచి ఆరోగ్యంతో కూడిన శారీరక దారుఢ్యం చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. శుక్రవారం రాయచోటిలోని జిల్లా పోలీసుల ఫేరెడ్ మైదానంలో ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బంది నుంచి విక్లీ పెరేడ్‌లో భాగంగా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు శాఖలో అంతర్గత క్రమశిక్షణతోపాటు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన పోలీసు దర్బార్‌లో ఆరోగ్య పరిరక్షణ (ఫిజికల్ ఫిట్‌నెస్), సంక్షేమం, వృత్తి నైపుణ్యం అంశాలపై దృష్టి సారించి కీలక ఆదేశాలు, స ఊచనలు జారీ చేశారు. ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. యోగా, ధ్యానం, వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ మరింత ఉత్సాహంతో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. సిబ్బందిలో మానసిక ఉల్లాసం, ఉత్సాహాన్ని పెంచడానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వివిధ అంశాలపై నిపుణులతో రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తామని వివరించారు. ఏఆర్ సిబ్బంది సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కారం చూపుతామని ఎస్పీ హామి ఇచ్చారు. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో గడపాలని సిబ్బందికి సూచింరరాఉ. దర్భార్ అనంతరం సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకొని వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, ఆర్‌ఐ ఎం పెద్దయ్య, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.