
దళితులకు అన్యాయం చేస్తుంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ స్ప
మదనపల్లె : కురబలకోట మండలంలో దళితుల భూములను టీడీపీ నేతలు కొల్లగొడుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ప్రశ్నించారు. మదనపల్లెలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కురబలకోట ఎంపీపీ ఎం.జి.భూదేవి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు నక్కా రమాదేవి, నాయకురాలు రెడ్డి కుమారి మాట్లాడారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ తంబళ్లపల్లె మాజీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి దళితుల భూములను లాక్కుంటున్నారని చెప్పారు. కడపక్రాస్‌లో హైవే పక్కన రూ.20 కోట్లు విలువ చేసే భూమిని మంత్రి మండిపల్లి బంధువు, అనుచరుడు ఆవుల సురేంద్రరెడ్డి, టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పేరిట కొనుగోలు చేశారని తెలిపారు. ఈ భూమిని చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యాలయాల్లో సామాన్యుల పనులు జరిగే పరిస్థితులు లేవని చెప్పారు. అలాంటిది దళితుల భూమికి గత కలెక్టర్ ఎన్‌వోసీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసు ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోందన్నారు. టీడీపీ నేతల నకిలీ మద్యం, భూదందాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. జయచంద్రారెడ్డి భూకబ్జాలు, నకిలీ మద్యం తయారీ, ఇసుక దందాలు చేయడమేగాక ప్రభుత్వభూమిని ఆక్రమించి స్టోన్‌క్రషర్ ఏర్పాటు చేశారని వారు చెప్పారు. ఈ సమావేశంలో అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి.ఆర్.ఉమాపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎం.ఆనందరెడ్డి, వసంతరెడ్డి పాల్గొన్నారు.
నిలదీసిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు