
కదిరి మహిళ..మదనపల్లెలో అదృశ్యం
మదనపల్లె రూరల్ : సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళ మదనపల్లెలోని బంధువు ఇంటికి వచ్చి అదృశ్యం కావడంపై ఆమె సోదరుడు శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన బాలాజీనాయక్ భార్య వి.భాగ్యమ్మ (35) తిరుపతిలో ఉన్న తమ్ముడు భాస్కర్ నాయక్ వద్దకు వెళ్లి అక్కడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. సెప్టెంబర్ 24న మదనపల్లె పట్టణం బుగ్గకాలువలో నివాసం ఉంటున్న దూరపు బంధువు పూర్ణ ఇంటికి వచ్చింది. కొద్దిరోజులుగా అక్కడే వారితో పాటు ఉంటోంది. అయితే ఈనెల ఏడోతేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భాగ్యమ్మ తమ్ముడు భాస్కర్‌నాయక్‌కు ఫోన్‌చేసి తనను మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద పూర్ణ, ఆటోడ్రైవర్ రెడ్డి కొడుతున్నారని చెప్పింది. అనంతరం మరోసారి రాత్రి 10గంటల సమయంలో ఫోన్‌చేసి వారి ఇంటికి వచ్చి మరోసారి తనను కొట్టారని, తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా ఇంటికి తీసుకెళ్లి బంధించారని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్‌ఆఫ్ అయింది. దీంతో భాస్కర్‌నాయక్, బంధువైన పూర్ణకు 8వతేదీ ఫోన్‌చేయగా భాగ్యమ్మ అప్పుడే వెళ్లిపోయిందని, తమ వద్ద లేదని సమాధానం ఇచ్చింది. రెండురోజుల పాటు భాగ్యమ్మ ఆచూకీ కోసం వెతికిన సోదరుడు భాస్కర్‌నాయక్ శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌ష్టేషన్‌కు చేరుకుని తన అక్క అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు.
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో
ఫిర్యాదుచేసిన సోదరుడు