
ఉచిత న్యాయ సేవలు పొందాలి
రాయచోటి : జైలులోని ఖైదీలు మంచి ఆరోగ్యంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత న్యాయ సలహాలను పొందాలని కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫకృద్దీన్ తెలిపారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు డాక్టర్ సి యామినీ ఆదేశాల మేరకు రాయచోటి సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జైలులో రిజిస్టర్లను పరిశీలించారు.. ఖైదీలకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్‌ను వివరించారు. ఖైదీలతో ఒక్కొక్కరిగా మాట్లాడి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబరు 15100పై వారికి తెలియజేశారు. సమస్యలుంటే రాయచోటి మండల న్యాయ సేవా సమితి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు.