
రాజంపేటలో రూ.5కే టీ షర్ట్!
రాజంపేట : రాజంపేట పట్టణంలో రూ.5 లకే టీషర్ట్ ఇస్తామని ఆర్‌ఎస్ రోడ్డులోని ఓ రెడిమేడ్ షాపు నిర్వహకుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆదివారం ఉదయం పాత బస్టాండు నుంచి ఆర్‌ఎస్ రోడ్డులో ఉన్న దుకాణానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకూ ఉంటుందని సోషల్‌మీడియా వేదికగా ప్రచారం సాగడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసుల అనుమతి కూడాలేకుండా బిజినెస్ పోస్టింగ్‌లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంపై పలువురు పెదవి విరిస్తున్నారు. ఆఫర్లతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేందుకు కారణమైన షాపు నిర్వహకుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుకాణం ఎదుట జనం తొక్కిసలాట