
ఆర్టీసీ బస్సు బోల్తా
మైదుకూరు : విజయవాడ నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరదాయపల్లె సమీపంలో శనివారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్‌తో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ నుంచి వస్తున్న బస్సులో జీవీసత్రం ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు బయలుదేరారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నెల్లూరు–బళ్లారి జాతీయ రహదారిపై వరదాయపల్లెకు సమీపంలో ఆపాలని కండక్టర్‌ను విద్యార్థులు కోరారు. ఆ మేరకు డ్రైవర్ కొన్ని మీటర్ల మేరకు బైపాస్‌పై ఉన్న బస్సును రివర్స్ చేసేందుకు యత్నించాడు. దాంతో బస్సు అదుపుతప్పి బోలాం్త పడింది. డ్రైవర్‌తోపాటు బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కడప డిపో అధికారుల సమాచారంతో గ్యారేజీ కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును యథాస్థితికి తెచ్చారు.