
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
రాయచోటి టౌన్ : ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, ఎస్‌ఎల్ బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు దండు వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. రాయచోటి ఎన్‌జీవో హోంలో శనివారం జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన ఉద్యోగుల హక్కుల రక్షణకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఎంపికై న ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి డివి.రమణ, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి నిత్యపూజయ్యలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాధ్యక్షుడు పల్లపుమహాదేవ, బడిశెట్టి దేవేంద్ర, బి.రవిశంకర్ పాల్గొన్నారు.