
రోడ్డు ప్రమాదంలో నాయబ్ రసూల్ మృతి
పోరుమామిళ్ల : స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం రాత్రి మోటార్ బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో షేక్ నాయబ్‌రసూల్(45) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్‌నగర్‌కుకు చెందిన రసూల్ కుమార్తె కోసం వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. రసూల్ తీవ్రంగా గాయపడి కింద పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రసూల్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు. రసూల్ భార్య రెహానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.