వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Sep 22 2025 6:52 AM | Updated on Sep 22 2025 6:52 AM

వ్యక్

వ్యక్తి అదృశ్యం

ఎర్రగుంట్ల : పట్టణంలోని ప్రకాశ్‌ నగర్‌లో నివాసముంటున్న నాగన్న కుమారుడు వలస గాళ్ల నాగరాజు(40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ప్రకాశనగర్‌ కాలనీకి చెందిన నాగరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు, ఇతడికి భార్య పెద్దక్క, కుమారుడు ఉన్నారు. నాగరాజుకు అప్పులు అధికంగా ఉండడంతో వాటిని తీర్చలేదని భావించి ఈ నెల 18న బయటకు పోయాడు. ఇప్పటివరకూ రాకపోవడంతో అతని భార్య పెద్దక్క పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగుంట్ల పోలీసులు తెలిపారు.

ఇంటి సామగ్రి దగ్ధం

చింతకొమ్మదిన్నె : మండలంలోని టి.క్రిష్ణాపురం గ్రామంలో ఉంటున్న నాగూరు భార్గవరెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు ఫైర్‌ ఇంజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఎలక్ట్రికల్‌ పరికరాలు, వాషింగ్‌ మెషిన్‌, ఫ్రిడ్జ్‌, టీవీ, బీరువాలు, అందులోని సర్టిఫికెట్లు, బట్టలు, డబ్బులు కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల విలువ మేర నష్టం జరిగినట్లు బాధితుడు భార్గవరెడ్డి తెలియజేశారు.

పల్లెల్లో జోరుగా పేకాట

సాక్షి టాస్క్‌పోర్స్‌ : కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నుల్లో పేకాట జోరుగా సాగుతోంది. యర్రగుడి పునరావాస కేంద్రం సమీపంలోని సపోట తోట, దొబ్బుడుపల్లె పమీపంలోని కంపచెట్ల వద్ద, కె.సుగుమంచిపల్లె పునరావాస కాలనీలోని చెట్ల వద్ద, కొండాపురం ఈసర్‌ పెట్రోల్‌ బంకు సమీపంలోని ఓ చీనీ తోటలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అసాంఘిక కార్యకలపాలపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కేబుల్‌ వైర్లు చోరీ

పులివెందుల రూరల్‌ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామం శోచరీపురం పొలం పరిధిలో 20మంది రైతుల తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం కేబుల్‌ వైర్లు అపహరించారు. రైతులు మాట్లాడుతూ పంట పండక, గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తోటల వద్ద బోర్ల కేబుల్‌ను అపహరించడంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్‌ మధ్య గూడ్స్‌రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో దిగువ రైలు పట్టాల వద్ద మృతిచెందిన వ్యక్తి 40–45 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వ్యక్తి అదృశ్యం1
1/1

వ్యక్తి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement