
ఆటో బోల్తా
కమలాపురం : కమలాపురం పట్టణం క్రాస్ రోడ్డు ఆర్చి వద్ద గుంతల్లో పడి ఆటో బోల్తా పడింది. కడప నుంచి కమలాపురం పట్టణంలోనికి ఆటో వస్తోంది. ఆర్చి వద్ద పెద్ద గుంత ఉంది. అందులో వర్షపునీరు నిలవడంతో గుర్తించలేక అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే స్థలంలో ఇది వరకూ ఓ వాహనంతోపాటు, మోటార్ బైక్ బోల్తా పడ్డాయని స్థానికులు తెలిపారు.
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని ఉమ్మారెడ్డిపల్లె సమీపంలో లారీ–మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. పిడుగురాళ్ల నుంచి అనంతపురానికి పెయింట్స్ లోడ్‌తో ఓ లారీ ప్రయాణిస్తోంది. ఎదురెదురుగా ఉమ్మారెడ్డిపల్లి సమీపంలో రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోనే ఇరుక్కపోయి డ్రైవర్ రాజేష్‌ను స్థానికులు బయటకు తీసారు.
ఆసుపత్రిలో పాము కలకలం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము ఆదివారం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశం ఉండడం, ఇటీవల వర్షాలు పడడంతో గర్భిణులు ఉండే వార్డులోకి పాము ప్రవేశించింది. గమనించిన రోగులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ వచ్చి కర్రతో కొట్టి చంపివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆటో బోల్తా