
పచ్చ మీడియా రాతలకు ప్రజలే బుద్ధి చెబుతారు
రైల్వేకోడూరు అర్బన్ : చంద్రబాబు డైరెక్షన్‌లో వక్ర భాష్యాలతో రాతలు రాస్తున్న పచ్చ పత్రికలకు ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా విలువలు కాలరాస్తూ రాసేవారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వైస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజూ వైఎస్.భారతి జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. తనకు నచ్చిన సేవా కార్యక్రమాలు, పేదలకు సాయం చేయడం తప్ప.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆర్భాటం చేయలేదన్నారు. పేదల హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల కోరు అని నిరూపించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రచురించడానికి వారికి సమయం లేదా అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు అధికంగా పెంచడం, నిత్యావసర ధరలు అధికమవడం, పాఠశాలలు, పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రవేటుపరం చేసి దండుకో వాలని చూడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల