
వీఆర్‌ఏల జిల్లా కమిటీ ఎన్నిక
రాజంపేట రూరల్ : ఏపీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామ సేవకుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందంగీసాహెబ్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా సీహెచ్.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడిగా మోడీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొరముట్ల సుధాకర్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎ.తిరుపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి.నరసింహులు, ఉపాధ్యక్షుడిగా ఇ.మధుబాబు, కే.మణి, ఎం.రామచంద్రయ్య, షేక్ ఖాదరవలి, కె.రమణయ్య, బి.రత్నమ్మ, ఎన్.లావణ్య, సహాయ కార్యదర్శులుగా ఎన్.నరసింహులు, ఎం.కోటేశ్వరరావు, బి.హరీష్, ఎన్.నరసయ్య, కోశాధికారిగా లకీ్‌ష్ మకర్, కమిటీ సభ్యులుగా ఎం.పీరయ్య, ఎ.శ్రీను, బి.సుబ్రహ్మణ్యం, పి.కులశేఖర్, ఇ.బలరామ్, సురేంద్ర, పి.గిరిజ, తదితరులు పాల్గొన్నారు.