
ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనియన్ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుంది. టీఎన్‌టీయూసీ యూనియన్‌కు చెందిన మనోహర్, పులి సుధాకర్‌రెడ్డిలకు స్వల్పంగా గాయలయ్యాయి. యూనియన్ నాయకులు కలమల్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పాల్సి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం 23 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిడి ఈ నెల 15వ తేదీ నుంచి నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో భాగమైన టీఎన్‌టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల కోసం వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు ప్రారంభం కాగా, అదే సమయంలో గేటు బయట టీఎన్‌టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు నిరసన చేపట్టాయి. విధులకు వెళ్తున్న ఉద్యోగ, కార్మికులను రెండు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని తోపులాట జరిగింది. టీఎన్‌టీయూసీ యూనియన్‌కు చెందిన మనోహర్, పులి సుధాకర్‌రెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో యూనియన్ నేతలు కలమల్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి చర్చించుకుని సర్దుబాటు అయ్యారు. జేఏసీ నేతలు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
ఆర్టీసీ బస్సు ఢీకొని
మహిళ మృతి
మదనపల్లె రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం గ్రామం పడమట వీధికి చెందిన గీర్వాణి(60) మాజీ సైనికోద్యోగి అయిన తన భర్త మురళీతో కలిసి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతోంది. మదనపల్లె నుంచి పీలేరు వెళుతున్న ఆర్టీసీ అద్దె వాహనం ఓవర్‌టేక్ చేస్తూ పక్కకు వెళ్లే క్రమంలో వారి ద్విచక్రవాహనాన్ని తాకింది. దీంతో బైక్ అదుపుతప్పి గీర్వాణి, మురళీ కిందపడ్డారు. ప్రమాదంలో గీర్వాణి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతితో ఆవేశానికి లోనైన కుటుంబసభ్యులు బస్సు డ్రైవర్ జానకిరామ్‌పై దాడి చేశారు. తమకు కేసు, పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. తాలూకా పోలీసులు విచారణ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు.
నిందితుల అరెస్టు
మదనపల్లె రూరల్ : తమ్ముడితో కలిసి కట్టుకున్న వాడిని అంతమొందించిన హత్య కేసులో నిందితులను అరెస్ట్‌చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సత్యసాయిజిల్లా తనకల్లు మండలం నందివారిపల్లెకు చెందిన జరిపిటి రామన్న(40) మద్యం మత్తులో రోజూ భార్య రమణమ్మతో గొడవపడేవారు. 2025 మార్చి, 12న యథాప్రకారం గొడవపడగా.. భార్య రమణమ్మ పప్పుగుత్తితో భర్త రామన్నపై దాడి చేసింది. అప్పటికే అక్కడే ఉన్న ఆమె తమ్ముడు ఈశ్వర్ కూడా అక్కను కాపాడే క్రమంలో రుబ్బురోలు తీసుకుని రామన్నపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హంద్రీనీవా కాల్వ వద్ద మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. మృతుడి సోదరుడు జరిపిటి లక్ష్మన్న ఫిర్యాదుతో విచారించిన పోలీసులు ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిపారు. నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన పప్పుగుత్తి, రుబ్బురోలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా, హెడ్ కానిస్టేబుల్ వేణు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామసముద్రం దిగువహరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు అంజప్ప(45) భార్య నాలుగేళ్ల కిందట మృతి చెందడంతో ఒంటరి జీవితాన్ని భరించలేకపోయాడు. మానసికంగా కుంగిన అతడు ఇంటివద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గుర్రంకొండ మండలం సరిమడుగు పంచాయతీ కృష్ణాపురానికి చెందిన చౌడప్ప కుమారుడు చలపతి(48) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
తమ్ముళ్లు డిష్యుం.. డిష్యుం..
టాస్క్ ఫోర్స్ : ఓటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి దౌర్జన్యాలు, రౌడీయిజం, దాడులు అధిక మయ్యాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలే పెట్టుబడిగా తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆర్థిక, భూ పంపకాలు, మద్యం మత్తుల్లో తెలుగు తమ్ముళ్లే ఒకరికి ఒకరు దాడులు చేసుకుంటూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం రాయచోటి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు జాబీర్, మరో తెలుగు మైనార్టీ నాయకుడు సయ్యద్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో జాబీర్, సయ్యద్ భాషాలు ఇరువురికి తీవ్రంగా రక్త గాయాలు అయ్యాయి. మదనపల్లి మార్గంలోని భూ తగదా విషయంపై ఇరువురి మధ్య ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. అయితే అధికార పార్టీకి చెందిన ఇరువురు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
ఇద్దరు మైనర్ల అరెస్టు
వేంపల్లె : స్థానిక పిల్లస్వామి గుట్ట సమీపంలోని జగనన్న కాలనీలో ఈ నెల 18వ తేదీన వాణి తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే కాలనీకి చెందిన ఖాదర్‌వలి, మరో ఇద్దరు మైనర్లు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు, వెండి చోరీ చేశారు. విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
కూలీ ప్రాణాలు తీసిన టిప్పర్..!
కురబలకోట : హైవే పక్కన రాంగ్ సైడ్‌లో నిలిపిన టిప్పర్‌ను మోటార్ సైకిల్‌పై వచ్చిన వ్యక్తి ఢీకొని మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో శనివారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం వాల్మీకీ నగర్‌కు చెందిన పి.సుధాకర్ (56) కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమార్తెను శుక్రవారం రాయచోటిలోని చెల్లెలు ఇంటి వద్ద వదిలి వస్తానని సుధాకర్ మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. భార్య రాత్రి పది గంటల సమయంలో పోన్ చేయగా వర్షం ఆగగానే ఇంటికి వచ్చేస్తానని బదులిచ్చాడు. శనివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా ముదివేడు సమీపంలోని తానా మిట్ట వద్ద ఆగిన టిప్పర్‌ను ప్రమాదవశాత్తూ ఢీకొట్టాడు. టిప్పర్‌ను రాంగ్ సైడ్‌లో ఆపి సిగ్నల్స్ కూడా వేయకపోవడమే ఇందుకు కారణమైంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం వేకువ జామున మృతి వార్త తెలుసుకుని భార్య, పిల్లలు విలపించారు. అమ్మా.. నాన్నకు ఏమైంది.. నాన్న ఎక్కడమ్మా..అని పిల్లలు రోధించడం చూపరుల కళ్లను చెమర్చాయి. మదనపల్లె ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు.
సోమశిల జలాలతో మునిగిన పొలాలు
పెనగలూరు : సోమశిల వెనుక జలాలు పెరగడంతో సిరివరి గ్రామానికి చెందిన వందల ఎకరాల పంట నీట మునిగింది. మామిడి తోటల్లోకి నీరు చేరడంతో చెట్లు చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 72 టీఎంసీలు నిల్వచేశారు. దీంతో సిరివరం, ఎన్‌ఆర్.పురం గ్రామంలోని చాలా పొలాలకు నీరు చేరింది. వారం పది రోజులలో కోసేందుకు వరి ప ంట సిద్ధంగా ఉండగా. నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోడిపందేల రాయుళ్లు అరెస్టు
సిద్దవటం : మండలంలోని మిట్టపల్లి సమీపాన రైల్వే బ్రిడ్జి వద్ద కోడి పందేలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. తనకు అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం సోదాలు చేయగా రైల్వేబ్రిడ్జి వద్ద కోడి పందెం ఆడుతూ కనిపించారన్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 10500 ల నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజంపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో కడప నుంచి రాజంపేటకు బయలుదేరారు. భాకరాపేట సమీపంలోని రాజస్థాన్ డాబా వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారు వేఉగంగా ఓవర్‌టేక్ చేసి వెళ్లింది. ద్విచక్ర వాహనంలో వస్తున్న వీరు ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వెనుకవైపు ఢీకొన్నారు. ప్రమాదంలో ఆకేపాడుకు చెందిన కమల్, మనక్కాయల పల్లికి చెందిన రితేష్, రాజంపేటకు చెందిన మున్నాకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వైద్యంకోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
మైదుకూరు : తనను బెదిరించి తన మోటార్ బైక్‌ను అగంతుకుడు ఎత్తుకెళ్లాడని ఓ భవన నిర్మాణ కార్మికుడు చేసిన ఫిర్యాదు ఓ అంతర్ రాష్ట్ర దొంగను పట్టించింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ వాసి బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్‌ను బ్రహ్మంగారిమఠం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల విలువచేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వివేకానంద కాలనీకి చెందిన షేక్ హుస్సేన్‌షా బేల్దారిగా పనిచేస్తున్నారు. బ్రహ్మంగారిమఠం ఈశ్వరీదేవి గుహ వద్ద ఈ నెల 16న పనులకు వెళ్లి కొద్ది దూరంలో బైక్ పార్కింగ్ చేశాడు. సాయంత్రం వచ్చి చూడగా.. నిందితుడు రాజశ్రీ గణేష్ తన బైక్‌ను స్టార్ట్ చేస్తుండడడంతో హుస్సేన్‌షా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావని ప్రశ్నించాడు. పక్కకు తప్పుకోకుంటటే చంపేస్తానంటూ చాకుతో బెదిరించి బైక్‌లో పరారయ్యాడు. బాధితుడు బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు రాజశ్రీ గణేష్‌ను పోలీసులు అనుమానించి విచారించారు. విచారణలో హుస్సేన్‌షా మోటార్ బైక్ అని తేలడంతో మరింత విచారణ చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణలోని పలు స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ బైక్‌లు చోరీ చేసినట్లు తెలిసింది. ఓ పాడుబడిన షెడ్‌లో నిందితుడు దాచిన పది మోటార్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కడప, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న సీఐ జె.శివశంకర్, బ్రహ్మంగారిమఠం ఎస్‌ఐ శివప్రసాద్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రలకు నగదు రివార్డులను అందజేశారు.
ముగ్గురిపై చీటింగ్ కేసు
కడప అర్బన్ : కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయభాస్కర్‌రెడ్డితోపాటు కుమార్తె రూప తన్మయి, సుజిత్‌కుమార్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రామకృష్ణ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. అరవింద్‌నగర్‌కు చెందిన నిత్య పద్మావతి 2019లో ఐదు ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత విజయభాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన నిపద్మావతి దగ్గర సంతకాలు చేసిన చెక్కు ఇప్పించుకున్నాడు. కుట్రపన్ని దాదాపు రూ.90 లక్షల మేర తాను, తమ ఇద్దరు పిల్లల ద్వారా డబ్బు డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ల ఈఎంఐలను కట్టించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
10 మోటార్ బైక్‌లు స్వాధీనం
రక్త గాయాలతో ఆసుపత్రికి చేరిక

ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ

ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ

ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ

ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ