
వీఆర్‌ఏలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాజంపేట రూరల్ : రాష్ట్రంలో వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం అడుగడుగునా విస్మరిస్తోందని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ మండిపడ్డారు. స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఎ)ల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో బందగీ సాహెబ్ మాట్లాడుతూ వీఆర్‌ఎలకు 8 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదని వాపోయారు. జీతం బెత్తెడు ఇస్తూ అక్రమంగా బండ చాకిరీ చేయించుకుంటాన్నారని వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పేస్కేల్ అమలు చేయాలన్నారు. అనంతరం ఎన్‌జీఒ హోమ్ నుంచి సబ్ కలేక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ భావనకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సీహెచ్.చంద్రశేఖర్, రవికుమార్, మధు, మోడీప్రసాద్, లక్ష్మీకర్, మని, నరసింహులు, కోటీ, తిరుపాలు, ఖాదరవల్లి, లావణ్య, రత్నమ్మ, తదితరులు పాల్గొరు.