
ఐదు దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లరును టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ సూచన మేరకు ఆర్‌ఐ కృపానంద, ఆర్‌ఎస్‌ఐ అల్లిబాషా, పోలీసులు రాజంపేట రోళ్లమడుగు ఫారెస్ట్ బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం పుట్టంగి మడుగు ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ కంటపడ్డారు. టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని చుట్టుముట్టే ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ అతడిని విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.