
సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు
రాజంపేట : భవిష్యత్తులో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమార్పులు ఉంటాయని ఆస్ట్రేలియాలని కాలహాన్, న్యూ సౌత్‌వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.ఆసాది శ్రీనివాసులు అన్నారు. ఏయూలో సీఎస్‌ఈ ఆధ్వర్యంలో ఎంఎల్,డీఎల్ సాంకేతికతో జనరేటివ్ ఏఐ అనువర్తనాలు అంశంపై అంతర్జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో జనరేటివ్ ఏఐ ద్వారా కొత్త ఔషధాల రూపకల్పన, రోగ నిర్ధారణకు ఎక్స్‌రే, స్కాన్ ఇమేజీ ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ చేయవచ్చునన్నారు. పరిశోధనలో భాగస్వామ్యం అవడానికి కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా మార్గదర్శనం పొందాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌డీ స్కాలర్ జి. శ్రీనివాసులు, హెచ్‌వోడి డా.ఎం.సుబ్బారావు, నవీన్‌కుమార్, బోధనాసిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.