
అడుగుపెట్టనివ్వం
మదనపల్లె వైద్య కళాశాల టెండర్లలో ప్రైవేటు వ్యక్తులు పాల్గొని ఎవరు టెండర్ దక్కించుకున్నా కళాశాల ఆవరణలోకి అడుగుపెట్టనివ్వం. కూటమి పాలనలో జలవనరుల పరంగా ప్రాజెక్టులను కోల్పోయిన ప్రజలు ఇప్పుడు పేదలకు వరమైన వైద్య కళాశాలను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఉద్యమాలు, ఆందోళనలు చేసైనా వైద్య కళాశాలను కాపాడుకుంటాం. వైద్య కళాశాల ఎదురుగానే ఆరోగ్యవరం ఉంది. ఇలాంటి ప్రాంతంలోని కళాశాలను ప్రైవేట్‌కు ఇవ్వడం దుర్మార్గం.
–పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే