
ప్రజల ఆస్తి
ప్రభుత్వ ఆధ్వర్యంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మదనపల్లె వైద్యకళాశాల జగన్ ఆస్తికాదు, ప్రజల ఆస్తి. ఇప్పటిదాకా ఎంత నిర్మాణం పూర్తయ్యిందో.. మిగిలిన పనులను ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా పూర్తి చేయాలి. దీనిని విస్మరించి చంద్రబాబు బినామీలైన కార్పొరేట్ సంస్థలకు వైద్యకళాశాలను అప్పగించి అమ్మేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గం. జగన్ చెప్పినట్టు కళాశాలను ఎవరు తీసుకున్నా తమ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రభుత్వపరం చేస్తాం.
–ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు