
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
రాయచోటి : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి సామాన్యులకు సైతం మెడికల్ కోర్సులు అందుబాటులోకి తెచ్చే విధంగా 17 కాలేజీలను మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి ప్రైవేటీకరణకు పూనుకోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత వైద్యం అందకుండాపోతుందన్నారు. వెంటనే 107, 108 జీఓలను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించి గత ప్రభుత్వం రూ.390 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో రూ.20 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మెడికల్ కళాశాలను నేడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడమంటే వైద్య రంగం కేవలం కార్పోరేటర్ల కోసమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి మణి, రామాంజులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
వి వెంకటేశ్వర్లు