రామసముద్రం : అక్రమాలకు పాల్పడిన ఎలవానెల్లూరు, కురిజల ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి నందకుమార్ రెడ్డి తెలిపారు. రామసముద్రం తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. నందరకుమార్‌రెడ్డి మాట్లాడుతూ 1 ఏప్రిల్, 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జరిగిన వివిధ రకాల పనులపై సామాజిక తనిఖీ జరిగిందన్నారు. గడచిన ఏడాదిలో 1287 పనులకు రూ.9.63 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఉపాధి సిబ్బంది నుంచి రూ.31,365 వేలు, రైతుల నుంచి రూ.1,07,113 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎస్టీఎం లోకేశ్వర్ రెడ్డి, వెంకయ్య, గపూర్, మాధవి, గౌరీశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.